Thursday, February 22, 2018

8th march - India - mass women in the people's war PCI(Maoist)

మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
మార్చ్8: అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాట సంపద్రాయాన్ని ముందుకు తీసుకువెళదాం!
మహిళల మీద అమలవుతున్న బ్రాహ్మణీయ హిందు ఫాసిస్టు దాడికి
వ్యతిరేకంగా సంఘటితమవుతూ పోరాటాన్ని తీవ్రతరం చేద్దాం!

ʹదళితులు, ఆదివాసులు, మహిళలు పీడనకోసం కాదు, అధికార హక్కు కోసంʹ అంటూ గొంతెత్తి నినదిద్దాం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పోరాట చరిత్ర ఉన్నది. మహిళల విముక్తి పోరాట దినంగా దీనిని జరుపుకుంటారు. దోపిడీ పీడనల నుంచి విముక్తి కోసం పోరాటంలోకి దిగిన శ్రామిక మహిళల సంకల దినం మార్చ్ 8. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభంలో ఇంటి నాలుగు గోడల నుంచి బయటకు వచ్చి ఫాక్టరీలలో కార్మికులయిన శ్రామిక మహిళలు తమ హక్కుల సాధన కోసం ప్రదర్శనలు చేయనారంభించారు. మహిళా కార్మికుల ప్రథమ మహాసభ 1909 ఫిబ్రవరి 28వ తేదీన జరిగింది. 1910లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ నాయకి కామ్రడ్ క్లారా జెట్కిన్ నాయకత్వంలో కోపెన్హాగెన్లో 17 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులతో సోషలిస్టు మహిళల అంతర్జాతీయ మహాసభ జయప్రదంగా జరిగింది. ఈ మహాసభలో మార్చ్ 8ని అంతర్జాతీయ దినంగా జరపాలని నిర్ణయించారు. ఆ తరువాత 1917 అక్టోబరు విప్లవంలో కూడు, గుడ్డ కోసం జరిగిన చారిత్రక ఉ ద్యమంలో ఎలగ్జాండ్రా కొల్లాంటా నాయకత్వంలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు. రష్యాలో వారు నిరంకుశ పాలనను కూల్చివేసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన సోషలిస్టు సమాజం మహిళలకు ఓటు హక్కుతో పాటుగా అనేక రంగాలలో వారికి సమాన అధికారాన్ని కల్పించింది.
భారతదేశంలో క్రీ.పూ. 1500లో ఆర్యులు ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు, అంటే 2018 మార్చ్ 8 వరకు పితృస్వామ్యం రూపం, సారం మార్చుకుంటూ నేటి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలోకి వచ్చారు. మానవాభివృద్ధి ప్రారంభ సమయంలో పశుపాలక సంచార సమణాలలో పితృస్వామ్య సమాజం, వ్యవసాయ ప్రధాన సమూహాలుగా ఉన్న మూలవాసులలో మాతృస్వామ్య సమాజం అస్తిత్వంలో ఉన్నాయి. క్రీ.పూ.1500లో ఆర్యులు సింధు నాగరికత మీద దాడి చేసి ఆ తరువాత విస్తరించారు. ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో పాటుగా నెలకొన్న పితృస్వామ్య పద్దతులు, భావనలను క్రీ.పూ. 600లో మనువు మనుస్మృతిలో పొందుపరిచాడు. వర్ల సమాజం అవిర్భవించిన నాటి నుంచి మహిళను అధికార స్థానం నుంచి ద్వితీయ స్థానానికి శాసివేశారు. క్రమేపీ సామాజిక శ్రమకు మహిళ దూరమయింది. ఈ క్రమంలోనే ఆస్తితా పాటుగా సంతానం మీద కూడా హక్కు కోల్పోయింది. నేడు మనువు వారసులు అనేక సందర్భాలలో తమ మహిళా వ్యతిరేక చరిత్రను ప్రకటించుకుంటున్నారు. రెండు దశాబ్దాల పూర్వం ʹజుట్టు కత్తిరించుకున్న వాళ్లకు పార్లమెంటులో స్థానం ఇవ్వరాదుʹ అంటూ జుట్టు కత్తిరించుకున్న మహిళా పార్లమెంటు సభ్యులను బహిరంగంగా హేళన చేశారు. ప్రస్తుత పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అధికార వర్గాల మధ్య కుమ్ములాటలతో సాగలాగుతున్నారు.
పునరుత్పత్తి శక్తిని అతీత శక్తిగా భావించిన ఆదిమ సమాజాలలో మహిళను ఒక గొప్ప శక్తిగా కొలిచారు. ʹయత్ నారేతు పూజ్యంతే తత్ర దేవతా సభ్యతʹ, అంటే ఎక్కడైతే స్త్రీని పూజిస్తామో అక్కడ దేవతలు సంతోషిస్తారు అన్నారు. ఆ తరువాత కాలంలో స్త్రీని భూమి లాంటిదన్నారు. భూమి తనంతట తాను పంటలను ఇవ్వలేదు, పురుషులు విత్తనాలు జల్లితేనే పంటలు పండుతాయి. ఎవరైతే విత్తనాలు జల్లుతారో వారికే పంట చెందుతుంది అన్న మనువాద భావన స్త్రీ పునరుత్పత్తి సామర్థ్యం మీద పురుషాధిపత్యాన్ని నెలకొల్పింది. స్త్రీ తన సంతానం మీద హక్కు కోల్పోయింది. మార్కిస్టు మహెపాధ్యాయుడు కామ్రడ్ ఎంగెల్స్ దీనిని మహిళల చారిత్రక ఓటమన్నాడు.
వేద కాలం నాటి నుంచి మహిళలకు వేదపఠనం నిషేధించారు. విద్యకు దూరం చేశారు. శిరస్సు తెగిపోతుందంటూ గార్లి, మైత్రేయి వంటి మేధ సంపన్నులైన మహిళల నోరు నొక్కేశారు. ఈ ఛాందసాన్ని ఖండిస్తూ భారతదేశంలో మొదటిసారిగా మహిళలకు చదువు అందించిన ఘనత జ్యోతిబా ఫూలే, సావిత్రీబా పూలేలకు చెందుతుంది. బ్రాహ్మణవాదుల నుంచి అనేక అవమానాలను ఎదుర్కొంటూ వారు ఈ పని చేశారు.
మనుస్మృతి దళిత, ఆదివాసీ, మహిళల మీద పెత్తనం, దౌర్జన్యాలకు పూర్తిగా అవకాశం ఇస్తూ, ʹదళితులు, ఆదివాసులు, మహిళలు పీడన కోసమే ఉన్నారుʹ అంటూ వారి మీద జులుం, అత్యాచారాలను పూర్తిగా అనుమతించింది. వేదకాలం నుంచి నేటి వరకు వేద భూమి పై శ్రామిక ప్రజల మీద బ్రాహ్మణీయ కుల పీడన అమలవుతున్నది. మనువు వారసులైన మోహన్ భాగవత్, నరేంద్ర మోదీ, అమిత్షా త్రయం ప్రజాస్వామిక లౌకిక భారతదేశాన్ని సమూలంగా మార్చివేసి భారతీయ సమాజాన్ని కాషాయీకరణ చేస్తూ మనుస్మతిని భారత రాజ్యాంగంగా, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించడానికి ఉబలాటపడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా సంఘటితమై ఉద్యమించవలసిన తరుణం ఆసన్నమయింది.
మనువు రూపొందించిన సూత్రాల ప్రకారం స్త్రీ స్థానం ఇలా ఉంటుంది. ʹకార్యేషు దాసీ, కరణేశు మంత్రీ, భోజ్యేసు మాతా, శయనేషు రంభాʹ, అంటే స్త్రీ సేవ చేసే దాసిగా తన భర్తకు, అతని కుటుంబానికీ సేవ చేయాలి, తన భర్త పనిలో మంత్రిలా సహాయం అందించాలి. తల్లిలా అతనికి వండి వడ్డించాలి. పడుకునే సమయంలో తన అందంతో పురుషునికి సంతోషం కలిగించాలి. ʹకౌమారే పితా రక్షతహ, వనే పతి రక్షితహ, వృద్దే పుత్రో రక్షతహʹ, అంటే స్త్రీ జన్మించిన నాటి నుంచి స్వతంత్రంగా ఉండరాదు. పురుషుని గొడుగు నీడలోనే ఆమె జీవితం సాగాలి. చిన్నతనంలో తండ్రి రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు రక్షణలో జీవించాలే తప్ప మరో విధంగా జీవించే అధికారం లేదంటుంది మనుస్మృతి.
వివాహ తంతులో కట్టే పసుపు తాడును పలుపు తాడుతో పోలుస్తూ భార్యను గుంజకు కట్టి బంధించి ఉంచే మనువు ఉపదేశాలతో నడిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి నాయకత్వంలో నడిచే రాష్ట్రీయ స్వయం సేవికా సంఘ్ శిక్షణా శిబిరంలో సేవికలకు ఈ రకంగా మాతృత్వంలో శిక్షణ ఇస్తున్నారు - ʹగొడ్డు చేయడానికి బయటకు వెళ్లినప్పుడు తన పిల్లల కోసం ఏకం తీసుకురాదు, కానీ మహిళకు ఏ కొద్ది ఆహారం దొరికినా తన కుటుంబం కోసం మూటకట్టి తీసుకురావాలి. ఈ తేడాను గుర్తించాలి. ఇటువంటి మాతృత్వాన్ని మహిళలు కోరుకునేది!?
2015కు ముందు మనసులోని మాటలో మోదీ, ʹఒక పుత్రిక పది మంది పుత్రులతో సమానంʹ అన్నాడు. కానీ వాస్తవం వేరుగా ఉన్నది. ఆడపిల్లలను పిండంలోనే హత్య చేయడం కారణంగా ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన గ్లోబల్ జెండర్ క్యాప్ సర్వే ప్రకారం 114 దేశాలలో భారతదేశం 108వ స్థానంలో ఉన్నది. ఆడపిల్ల పుడితే వేడుక చేసుకోవాలని చెబుతున్న మోడీ పాలనా కాలంలో ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యా సంస్థలలో మహిళల వస్త్రధారణ మీద విధించిన నిబంధనలకు వ్యతిరేకంగా ʹపింజడా తోడ్ʹ (పంజరాన్ని ఛేదిద్దాం) ఉద్యమం చేయవలసి వచ్చింది.
భారతీయ సమాజం మీద హిందుత్వ అధిపత్యం ఉన్నది. ఇది వేళ్లూనుకుని ఉన్నది. దోపిడీ ఉన్నంత కాలం మతం కూడా కొనసాగుతుంది. మతం మనిషి విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దోపిడీ వర్గం మతాన్ని సాధనంగా ఉపయోగించుకుంటుంది. మతం మత్తు నుంచి బయటకు తీసుకురావడానికి ప్రజలను ముందుగా దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సంఘటితం చేయాలి. మహిళలకు కూడా ఇదే వర్తిస్తుంది. మహిళలు ప్రధానంగా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సగ భాగం తీసుకుంటూ పితృస్వామ్యానికి వ్యతిరేక చైతన్యం పెంపొందించుకోవాలి. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
ప్రపంచంలో గత రష్యా, చైనాలలో జరిగిన విప్లవాలలో మహిళలు ముఖ్యమైన దోహదం చేశారు. గత విప్లవాలకు భిన్నంగా భారతదేశంలో జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవంలో మహిళలు ప్రజాయోధులుగా తమ వంతు పాత్రను నిర్వర్తిస్తున్నారు. 1960 తరువాత మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీల నాయకత్వంలో జరుగుతున్న ప్రజాయుద్ధంలో మహిళలు విడదీయరాని భాగంగా ఉంటూ సైనిక క్షేత్రంలో చురుకుగా పని చేస్తున్నారు. శత్రువు మీద సాహసంగా దునుమాడుతున్నారు. బ్రాహ్మణవాదం మహిళలు సాయుధం కావడాన్ని అంగీకరించదు. కానీ దేశంలో భూస్వామ్య వ్యవస్థ, బడా బూర్జువా, పితృస్వామ్య వ్యవస్థ, దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్న బ్రాహ్మణత్వాన్ని అంతమొందించడానికి నడుం బిగించిన మహిళల మీద నిర్బంధం ప్రయోగించే ప్రతీఘాతుక సైన్యంలో మహిళలను భర్తీ చేసుకుని సుదూర దండకారణ్య అడవులలో మొహరిస్తున్నారు. ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయడం ఇవాళ దండకారణ్య మహిళల ప్రధాన కర్తవ్యం.
ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ సమూహాల అస్తిత్వం, గుర్తింపు కోసం క్రూరమైన విస్టాపనకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి నిలబడవలసిన సమయం ఆసన్నమయింది. జల్-జంగల-జమీన్-ఇజ్జత్-అధికారితో పాటుగా మహిళా పురుష సమానత్వం, ఆస్తి మీద, సంతానం మీదా సమాన అధికారం కోసం ఉద్యమించవలసిన సమయం ఆసన్నమయింది. ఈ దేశంలో వర్ణవ్యవస్థ తెచ్చిన బంధానాలలో, సంప్రదాయ పితృస్వామ్య బంధనాలలో పడి నలిగి కొట్టుమిట్టాడుతున్న మహిళలతో పాటుగా బ్రాహ్మణీయ హిందుత్వ వర్ణవ్యవస్థలో పెత్తనంలో నలుగుతున్న సమస్త మహిళలూ మేల్కొని పోరాడాలని దండకారణ్య క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపునిస్తున్నది. మిత్రులారా రండి! మహిళా విముక్తి బావుటాను ఎత్తిపట్టి ప్రజాయుద్ధంలో అడుగులు వేస్తూ ముందుకు సాగండి!
* 8 నుంచి 14 నూర్చ్, 2018 వరకు గ్రామ గ్రామానా కాగడా ఊరేగింపులు జరపండి!
* మహిళా విముక్తి కోసం పురుష నునువు, అతని వారసులు మోదీ-మోహన్ భాగన-రీమన్ సింగ్-ఫటనీస్ దిష్టిబొమ్మలను గ్రాను గ్రానూనా తగులబెట్టండి!
* గాను గ్రామానా బ్రాహ్మణీయ కుల పీడనకు వ్యతిరేకంగా చర్స్ సదస్సులు నడపండి!
* అల్-జంగిల్ జమీన్ మీద ఆధికారీ నది. అందులో సగం మేం అంటూ గొంతెత్తి నినదించానండి!
-క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్, దండకారణ్యం

No comments:

Post a Comment